TG: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువగా ఉన్నా అత్యధికమంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నట్లు తాజాగా వెల్లడైంది. తెలంగాణలో మొత్తం 39,641 స్కూళ్లలో 62.36 లక్షల మంది విద్యార్థులుండగా అందులో 24,214 ప్రభుత్వ పాఠశాలల్లో 16,61,520 మంది, 12 వేల ప్రైవేట్ స్కూళ్లలో 37.43 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నట్లు సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే వెల్లడించింది.