NRML: శ్రీరామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో జిల్లా ఎస్పీ డా. జీ. జానకి షర్మిల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాత్ర శాంతియుతంగా సాగేలా డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలతో పహారా కాయాలని ఆదేశించారు. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.