ASF: కాగజ్ నగర్ పట్టణంలో టార్గెట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్ ప్రారంభం కానుంది. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి ఉన్నత విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. 30 రోజులపాటు ఈ కోచింగ్ తరగతులు స్థానిక వసుందర కాలేజిలో నిర్వహిస్తామన్నారు.