NDL: డోన్ న్యాయవాది కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పోలీసులను అవమానించేలా మాట్లాడారనే ఆరోపణలపై ప్రజలు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ MRPS జిల్లా ఉపాధ్యక్షుడు నాగన్న స్పందిస్తూ.. బాధ్యతాయుత వృత్తిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వెల్లడించారు. పోలీసులు ప్రజల రక్షణకే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.