SS:పెనుకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేశులు శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు వారి గ్రామానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా రూ. 15వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.