TG: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వ హించారు. ఈ వేడుకలో మైహోం గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య, వేద మంత్రోచ్ఛారణలతో ముచ్చింతల్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.