TG: కరీంనగర్ జిల్లా కేంద్రంలో RSS శతవసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలను స్వయంగా ఆయనే పాడటం విశేషం. వందేమాతం శ్రీనివాస్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు RSS కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.