ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో మనీష్ పాండే ఒకడు. ఈ మెగా టోర్నీ ఆరంభం(2008) నుంచి ప్రతి సీజన్లోనూ పాండే ఏదో ఒక జట్టు తరఫున ఆడుతూనే ఉన్నాడు. IPL చరిత్రలో సెంచరీ సాధించిన తొలి భారతీయ ఆటగాడి రికార్డు అతడి పేరిటే ఉంది. 2009లో RCB తరఫున ఆడుతూ డెక్కన్ చార్జర్స్ మీద ఈ ఘనత సాధించాడు. ప్రస్తుత సీజన్లో పాండే KKR జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.