KMM: సింగరేణి మండల తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న అనంతుల రమేష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా ఓరుగంటి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో నేలకొండపల్లిలో పనిచేసిన వెంకటేశ్వర్లు త్వరలోనే సింగరేణి మండల బాధ్యతలను స్వీకరించనున్నారు.