AP: పెట్రోల్, డీజిల్పై ఎక్సెజ్ సుంకం తగ్గింపును AP స్వాగతిస్తోందని CM చంద్రబాబు తెలిపారు. సవాళ్ల సమయంలో నాయకత్వ శక్తి బయటపడుతుందని అన్నారు. క్లిష్టపరిస్థితుల్లో దేశానికి స్థిరత్వం కల్పిస్తున్న మోదీ నేతృత్వం దేశానికి వరమని కొనియాడారు. అనేక దేశాలు ఇంధన ధరల భారం ప్రజలపై మోపుతున్నాయని.. భారత్ మాత్రం ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటుందన్నారు.