MDCL: శ్రీరామ నవమి సందర్భంగా అల్వాల్ పట్టణ పరిధిలో వాడవాడలా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, డిసి భోగేశ్వర్లు, నాయకులు హాజరయ్యారు. టెంపుల్ అల్వాల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు.