SRD: కంగ్టి మండలం తడ్కల్ ZPHS పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సమగ్ర శిక్ష (AWP&B) అంచనా విలువ రూ.27 లక్షలతో భవనం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ తట్టి సావిత్రి వీరేశం మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి గదుల నిర్మాణం పూరి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.