MBNR: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. రేపు ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.