MDK: మెదక్ పట్టణంలోని రామాలయంలో ఇవాళ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎస్పీకి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడిని దర్శించుకునిప్రజలు సుఖశాంతులతో జీవించాలని, జిల్లాలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండాలని ప్రార్థించారు.