VKB: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పరిగి మున్సిపల్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్‌లో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.