WGL నగరంలోని రంగశాయిపేటలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ MLA నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణాన్ని తిలకించారు. నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.