TG: నిర్మల్ జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ హిందువులపై అరచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హిందూ పండుగలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. శ్రీరామనవమి శోభాయాత్రకు కూడా ఆంక్షలు పెట్టారని విమర్శించారు. హనుమాన్ భక్తులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఎస్పీ జానకి షర్మిల తీరును అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు.