NRPT: NSS వేసవి శిబిరంలో భాగంగా చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. అక్షరాస్యత, బాల కార్మికులు, మరుగుదొడ్లు, ప్రభుత్వ పథకాలు, చేనేత కార్మికుల జీవన విధానాలపై వివరాలు సేకరించారు. అలాగే ప్రజలకు ప్లాస్టిక్ వాడకంపై నిరోధం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.