KMM: పెనుబల్లి మండలం లంకపల్లిలో 1962 పశుసంచార వైద్య సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో ఒక పాడి గేదె ప్రాణాలను కాపాడారు. రైతు నక్క సుమన్‌కు చెందిన సూడి గేదెకు అత్యవసర పరిస్థితి తలెత్తడంతో సత్తుపల్లి పశుసంచార వాహనానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పారావెట్ జగదీష్, హెల్పర్ సుభాని, డ్రైవర్ మహాకవి ఘటనా స్థలానికి చేరుకుని అత్యాధునిక వైద్యం అందించారు.