GDWL: మల్దకల్ మండలం పరిధిలోని తాటికుంటి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగగా పేర్కొన్నారు.