SRCL:వేములవాడలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులు బారికేడ్లు దాటి లోపలికి చొచ్చుకుని రావడంతో గందరగోళ పరిస్థితి ఎర్పడింది. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం ముగిసిన అనంతరం షామియానాల వెలుపల ఉన్న భక్తులు ఎండ తీవ్రత భరించలేక ఒక్కసారిగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు భక్తులకు మధ్య తోపులటా జరిగింది.