NRPT: శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. ఇవాళ నారాయణపేట పట్టణంలోని పళ్ళ హనుమాన్ దేవాలయం, అప్పిరెడ్డి పల్లి రామ్ దేవుని కొండపై వెలసిన శ్రీరాముడి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు.