ADB: గాదిగూడ మండలం గౌరీ గ్రామంలోని ఆదివాసీలు పెళ్లి వరకట్నాన్ని నిషేధిస్తూ తీర్మానించారు. ఈ క్రమంలోనే శుక్రవారం వధువు సేకుబాయి పెళ్లి కోసం ఊరంతా కలిసి రూ.12,551 నగదును అందజేశారు. ఇక నుంచి గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు వరకట్నాలు తీసుకోబోమని గ్రామ పటేల్ మడావి ధర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరి బాదిరావు, మోతిరాం, హీరమన్, నాగోరావ్ ఉన్నారు.