AP: అన్నమయ్య జిల్లాలోని ప్రసిద్ధ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండకపోవడానికి ప్రధాన కారణం.. రాముడు ఆంజనేయుడిని కలవకముందే ఈ ఆలయ ప్రతిష్ఠ జరగడం. వనవాస సమయంలో సీతా, లక్ష్మణులతో కలిసి రాముడు యాగ రక్షణ కోసం ఇక్కడ ఉన్నప్పుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారని, అప్పటికి హనుమంతుడితో పరిచయం లేకపోవడంతో ఆ విగ్రహం లేదని స్థల పురాణం చెబుతోంది.