MBNR: భూత్పూర్ మండలంలోని అన్నసాగర్లో శ్రీరామనవమి వేడుకలు కనులపండువగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, భక్తి కీర్తనల మధ్య జరిగిన ఈ వేడుకలో సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి దంపతులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.