అన్నమయ్య: మదనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ అధికారి సబ్-రిజిస్ట్రార్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేసి రూ.50 లక్షలు వసూలు చేయాలని ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బాధితుడి వ్యక్తిగత, స్థిరాస్తి వివరాలు సేకరించి ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఫోటోలు తీసి ఒత్తిడి పెంచినట్లు పోలీసులు తెలిపారు.