GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా భక్తులకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ సేవ చేయడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.