AKP: నర్సీపట్నం న్యాయస్థానాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శుక్రవారం సందర్శించించారు. ఈ సందర్భంగా ఆయనకు బార్ అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శుల మెట్టా ప్రభాకర్, అనిమిరెడ్డి శివ కృష్ణ స్వాగతం పలికారు. కోర్టు సముదాయంలో అదనపు కోర్టులు ఏర్పాటుకు కావలిసిన వసతి సదుపాయలను పరిశీలించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి షియాజ్ ఖాన్ అందజేసిన నివేదికను పరిశీలించారు.