GDWL: గట్టు మండలం పరిధిలోని అంతంపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రైతు సంబరాలో బాగంగా బండి గిరక కార్యక్రమాన్ని గట్టు మాజీ ఎంపీపీ జై విజయ్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుకు ఒక ప్రాణం పశువులు, వాటిపైన ప్రేమ అభిమానాలు ఇలాంటి క్రీడలు వల్ల పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు కేకలు వేసుకుంటూ తిలకించారు.