NRML: కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్వితరమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.