CTR: శ్రీరామనవమి సందర్భంగా కుప్పంలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆమె స్వయంగా ఫలహారాలు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది.