TPT: పుత్తూరు(M) పరమేశ్వర మంగళంలోని రామాలయంలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వహకులు, స్థానికులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పాలకుడు శ్రీరాముడు అని కొనియాడారు.