జియో స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం 8 రోజుల్లోనే రూ. 1088 కోట్ల గ్రాస్ వసూళ్లతో వెయ్యి కోట్ల మార్కును అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇందులో ఇండియా వసూళ్లు రూ. 814 కోట్లు కాగా, ఓవర్సీస్ వాటా రూ. 274 కోట్లు. భారతీయ సినిమా సత్తాను ఈ చిత్రం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.