VZM: గరివిడి మండలం కొండపాలెం పంచాయతీలో జె.క్వార్టర్స్‌లో శుక్రవారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం పర్యటించారు. ఇంటి పన్నులు, కొళాయి పన్నులు సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ నెలాఖరు వరకు చెల్లించాలి అన్నారు. శానిటేషన్, మంచినీటి సరఫరాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఈవో వేణుగోపాలరావు పాల్గొన్నారు.