TG: HYD ఇబ్రహీంపట్నంలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నందిగూడెం మండలం శ్రీరంగపురంనికి చెందిన కందిమల్ల నాగేశ్వర్ రావుకు సాయి(20) అనే కుమారుడు ఉన్నాడు. కాగా, సాయి ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో ఉంటూ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.