కోనసీమ: మండపేట నియోజకవర్గ ప్రజలకు ఇవాళ రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలన్నారు.