KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో సంక్షిప్త రామాయణ ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలను బొమ్మల రూపంలో కళ్లకు కట్టినట్లు భక్తులకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రదర్శించారు. స్వయంవరంలో శివ ధనుర్బాణం విరుచుట, కళ్యాణం, వనవాసంలో మాయ బంగారు జింక, సీతమ్మ అపహరణ ఇలా ఎన్నో అద్భుత సన్నివేశాలను తీర్చిదిద్దారు.