టాలీవుడ్ హీరో నాగశౌర్య, దర్శకుడు రామ్ దేశిన కాంబోలో రాబోతున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు మేకర్స్ విషెస్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విధి యాదవ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.