BHPL: రేగొండ మండలం చెన్నాపురం (రూపురెడ్డిపల్లి) గ్రామంలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు స్థానిక రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. MLA మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరారు.