AKP: అచ్యుతాపురం మండలం రామన్నపాలెం, మోసయ్యపేట గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. భక్తులు పలువురు ఆలయాలను సందర్శించి సీతారాములను దర్శించుకుని కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సీతారాముల కల్యాణ ఉత్సవాల్లో పాల్గొన్నారు.