సత్యసాయి: శ్రీరామనవమి పురస్కరించుకుని ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.