AP: ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.