TPT: తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలోని శ్రీ రాములవారిని ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకున్నారు.