ATP: శ్రీరామనవమి పురస్కరించుకుని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలోని గాంధీ నగర్ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చుక్కులూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి, యల్లనూరు రోడ్డులోని వాల్మీకి మహర్షి విగ్రహాలకు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.