NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీరాముని దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, సరిత దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు శుక్రవారం సమర్పించారు. అనంతరం శ్రీరాముని కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.