TG: గడ్డిమందు నిషేధ అంశం పార్లమెంట్‌కు చేరింది. ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ అనే గడ్డిమందును పూర్తిగా నిషేధించాలని ఎంపీ కడియం కావ్య లోక్ సభలో డిమాండ్ చేశారు. ఈ మందు ద్వారా రైతులు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.