SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ (సోషల్ ఆడిటింగ్) గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ పనుల అమలు, ఎదురవుతున్న సమస్యలపై కూలీలు, గ్రామస్థులతో చర్చించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సమస్యలను గ్రామస్థులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.