PDPL:ధర్మారం రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వేసవికాలంలో భక్తుల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ దాగేటి రాజేశ్వరి ప్రారంభించారు.