జయశంకర్ భూపాలపల్లిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి ఫొటోను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 8712658120 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై సాంబమూర్తి కోరారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.