E.G: సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలోని శ్రీ సీతారాములవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.